Header Banner

RRR: ఉండిలో ఆక్వ రైతుల సదస్సు.. ఆక్వాకల్చర్ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి!

  Sun Apr 13, 2025 21:25        Politics

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండిలో ఆక్వా రైతుల సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ట్రంప్ సుంకాల కారణంగా వస్తున్న ఇబ్బందులు, ధరల స్థిరీకరణ, విద్యుత్ సబ్సిడీలు వంటి అంశాలపై రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, పీఎస్సీచైర్మన్ రామాంజనేయులు, ఎంపీ బీదా మస్తాన్ రావు, జిల్లా కలెక్టర్, పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఆక్వా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హామీ ఇచ్చారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అమెరికాకు రొయ్యల ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయని, అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆక్వా రంగంపై ప్రభావం పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అధికారులు, ప్రభుత్వం తరపున అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ, రొయ్యల ఫీడ్ ధరలను కేజీకి నాలుగు రూపాయలు తగ్గించినట్లు తెలిపారు. అంతేకాకుండా, భీమవరంలో 80 లక్షల రూపాయలతో ఒక ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. త్వరలోనే అమరావతిలో ఆక్వా ఇండస్ట్రీ ఎగుమతిదారులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #RRR #AndhraPradesh #APpolitics #YCP #Jagan #AtchannaiduSpeech